NALGONDA : నల్గొండ జిల్లాలో దారుణం.. ఆకతాయిల వేధింపులకు యువతి బలవన్మరణం..!
NALGONDA : నల్గొండ జిల్లాలో దారుణం.. ఆకతాయిల వేధింపులకు యువతి బలవన్మరణం..!
మడుగులపల్లి: మన సాక్షి :
ఆకతాయిలా వేధింపులు తాళలేక మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం లో చోటు చేసుకుంది. మాడుగులపల్లి ఎస్సై జి.శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు కొత్త కళ్యాణి (18). ఈమె వృత్తి రీత్యా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది.
అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అరూరి శివ, కొమ్మనబోయిన మధు కళ్యాణికి ఫోన్ చేసి వాట్సప్, ఇన్ స్టా గ్రామ్ లో, ఫోటోలు మార్పిడి చేసి స్టేటస్ గా పెడతామని బెదిరించడంతో భయపడి పోయిన కళ్యాణి మనస్థాపానికి గురై శనివారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి పడిపోవడంతో గమనించిన తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో మిర్యాలగూడలోని ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నల్గొండలోని సంకల్ప ఆసుపత్రికి తరలించారు. తదనంతరం చికిత్స పొందుతూ మంగళవారం రోజు తుది శ్వాస విడిచింది. అనంతరం మృతురాలి తల్లి కొత్త రజిత ఫిర్యాదు మేరకు ఏ-1గా అర్రురి శివ, ఏ-2గా కొమనబోయిన మధు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్సై శోభన్ బాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జలక్.. వారికి రుణమాఫీ కట్..!









