Shankarpalli : రేవతి హైస్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహణ..!
Shankarpalli : రేవతి హైస్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహణ..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
మత్తు వద్దు… భవితే ముద్దు అని శంకర్‌పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మునిసిపల్ పరిధిలోని రేవతి హై స్కూల్ లో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాంటీ డ్రగ్స్ పై నిర్వహించిన పోటీలలో 400 మంది విద్యార్థులు పాల్గొనగా.. విజేతలకు సీఐ బహుమతులు అందజేశారు.
సీఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భవిష్యత్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. పిల్లలు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.
మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. అందులో భాగంగానే కళాశాలలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్ శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ పావని, జోష్ణశ్రీ, ఇన్చార్జి అర్చన, సాంబశివరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.









