TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Awesome : అద్భుతం.. గాజు సీసాలో సీత రాముల విగ్రహాలు..!

Awesome : అద్భుతం.. గాజు సీసాలో సీత రాముల విగ్రహాలు..!

సూర్యాపేట, మనసాక్షి :

గాజు సీసాలో సీత రాముల విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25 వ వార్డుకు చెందిన కూరేళ్ల పోతులూరాచారి వృత్తి రీత్యా కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తూ వివిధ రకాల కళాఖండాలను సీసాలలో బంధించడం ఆయన అలవాటు. గతంలో అనేక రకాల రాజకీయ నాయకుల,జాతీయ నాయకుల బొమ్మలను సీసాలో తన ప్రతిభతో బంధించాడు.

ఈనెల 6న జరిగే శ్రీరామ నవమి సందర్భంగా బాల రాముడు, శ్రీరాములవారు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయస్వామి విగ్రహాల బొమ్మలను సీసాలో పెట్టి ప్రదర్శిస్తున్నాడు. ఒక్కొక్క బొమ్మను 20 రోజులు చొప్పున సుమారు 80రోజులు పాటు శ్రమించి ఈ బొమ్మలను తయారు చేయగా ఆయన ప్రతిభను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

MOST READ : 

  1. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!

  2. Miryalaguda : ఎస్వి మోడల్ స్కూల్లో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు..!

  3. TG News : సన్న బియ్యం లబ్ధిదారుడి కుటుంబంతో మంత్రి ఉత్తమ్ భోజనం..!

  4. Paddy Centers : కొనుగోలు కేంద్రాలలో ధాన్యంకు మద్దతు ధర.. రూ.500 బోనస్ పొందండి..!

మరిన్ని వార్తలు