Axis Bank: సత్తా చాటిన యాక్సిస్ బ్యాంక్.. రూ.7,118 కోట్ల లాభం..!

Axis Bank: సత్తా చాటిన యాక్సిస్ బ్యాంక్.. రూ.7,118 కోట్ల లాభం..!
ఢిల్లీ:
ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.7,117.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది ముందటి ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే త్రైమాసికంలో సాధించిన రూ.7,129.67 కోట్ల కంటే స్వల్పంగా తగ్గినప్పటికీ, మొత్తం ఆదాయం రూ.35,990 కోట్ల నుంచి రూ.38,022 కోట్లకు పెరిగింది.
బ్యాంక్‌లో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) రేటు 1.43% నుంచి 1.28%కు మెరుగుపడగా, నికర ఎన్‌పీఏలు 0.31% నుంచి 0.33%కు స్వల్పంగా పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 6% వృద్ధితో రూ.13,811 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ మార్జిన్ 3.97%గా నమోదైంది.
పూర్తి ఆర్థిక సంవత్సరం (2024-25)లో బ్యాంక్ నికర లాభం రూ.26,373 కోట్లకు చేరింది, ఇది 2023-24లో రూ.24,861 కోట్లతో పోలిస్తే గణనీయమైన వృద్ధి. అదే సమయంలో, మొత్తం ఆదాయం రూ.1,31,810 కోట్ల నుంచి రూ.1,47,934 కోట్లకు పెరిగింది. మార్చి 31 నాటికి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 9% వృద్ధితో రూ.16,09,930 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఒక్కో షేరుకు రూ.1 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.
MOST READ :
-
SBI Life: సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్..!
-
Rajiv Yuva Vikas : రాజీవ్ యువ వికాసం.. ముందుగా వారికి 4 లక్షలు, ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు..!
-
SBI Life: సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్..!
-
Godrej : అత్యాధునిక హోమ్ లాకర్లు.. ఆవిష్కరించిన గోద్రెజ్..!
-
Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!









