Miryalaguda : హాస్టల్లో నాణ్యతలేని అల్పాహారం.. సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం..!
Miryalaguda : హాస్టల్లో నాణ్యతలేని అల్పాహారం.. సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
హాస్టల్లో విద్యార్థులకు నాణ్యతలేని అల్పాహారం పెట్టడంతో సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని శ్రీనివాస నగర్ బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ లో ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హాస్టల్ లోని ఉదయం అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారా అంటూ హాస్టల్ సిబ్బందిపై, ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఉదయం పెట్టే అల్పాహారం లిస్ట్, ఈరోజు అల్పాహారంలో ఉపయోగించిన వస్తువుల లిస్ట్ వెంటనే నాకు వివరణ ఇవ్వాలని సూచించారు. అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. మంచి విద్యను నేర్చుకొని తల్లి తండ్రులు గర్వపడే విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.
నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి కాదు. నేను అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్తని మాత్రమే అని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని అన్నారు. అలాగే ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు.. అదే విధంగా మీరు అంతా చదువుకొని ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపేలా ఆదర్శ వంతంగా మారాలి అని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంఈఓ బాలాజీ నాయక్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update










