Bajaj Allianz : బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త ఫండ్ ఆవిష్కరణ..!

Bajaj Allianz : బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త ఫండ్ ఆవిష్కరణ..!
పుణె, మన సాక్షి:
భారత అగ్రశ్రేణి జీవిత బీమా దిగ్గజ బజాజ్ అలియాంజ్ లైఫ్, తమ యులిప్ కస్టమర్ల కోసం ‘బజాజ్ అలియాంజ్ లైఫ్ నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్’ పేర న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్‌వో) ప్రకటించింది. ఈ పథకం నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ MQVLv 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. పాలసీదారులకు ఇది లైఫ్ కవరేజీ ఇస్తుంది, మల్టీఫ్యాక్టర్ ఆధారిత ఈక్విటీ ఇండెక్స్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తుంది.
బజాజ్ అలియాంజ్ లైఫ్ యులిప్ పథకాలు పాలసీదారులు తమ జీవిత లక్ష్యాలు సాధించడంలో సహాయపడతాయి. ఈ కొత్త నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్ జీవిత బీమా కవరేజీ అందిస్తూ సంపద సృష్టి అవకాశాలు కల్పిస్తుంది. నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ MQVLv 50 ఇండెక్స్ నిబంధనలు ఆధారపడి పని చేస్తుంది.
ఇది ముమెంటం, నాణ్యత, విలువ, తక్కువ వోలటైలిటీ (Low Volatility) అనే నాలుగు ప్రధాన అంశాల ప్రాతిపదికన నిఫ్టీ 500 స్టాక్స్ నుంచి 50 స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంది. ఈ ఫండ్ పాసివ్ విధానంలో ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఇది వైవిధ్యభరితమైన 50 స్టాక్స్ పోర్ట్‌ఫోలియో ఇస్తుంది, మల్టీఫ్యాక్టర్ వ్యూహం కింద పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తుంది. ఈ ఎన్ఎఫ్‌వో 2025 జూలై 1న ప్రారంభమై 2025 జూలై 14న ముగుస్తుంది.
భారతీయ క్యాపిటల్ మార్కెట్లు విస్తరిస్తున్న కొద్దీ, ఇన్వెస్టర్లు నిలకడగా రాబడులు అందించే, డేటా ఆధారిత, క్రమపద్ధతిలో ఉండే ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్స్‌ను అన్వేషిస్తున్నారు. ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి ప్రయోజనాలు అందించేలా రూపొందిన ఇండెక్స్‌ను ట్రాక్ చేసేలా తీర్చిదిద్దిన ఈ ఫండ్, ఇన్వెస్టర్లకు ప్రయోజనం అందిస్తుంది.
బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు రావూరి మాట్లాడుతూ, “మా యులిప్ పథకాల్లో భాగంగా ఈ మల్టీఫ్యాక్టర్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరం. మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఫ్యాక్టర్ ఆధారిత పాసివ్ వ్యూహం పెట్టుబడులు కొనసాగించేందుకు ఒక క్రమశిక్షణతో కూడుకున్న స్మార్ట్ మార్గంగా ఉపయోగపడుతుంది.
బజాజ్ అలియాంజ్ లైఫ్ నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్ ప్రధానంగా ముమెంటం, క్వాలిటీ, వాల్యూ, తక్కువ వోలటైలిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పద్ధతి ప్రకారం, నిబంధనలు ఆధారపడి పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగపడుతుంది. షేర్ల ఎంపికలో భావోద్వేగాలపరమైన పక్షపాతధోరణులు నివారించడంలో తోడ్పడుతుంది. దీర్ఘకాలికంగా సంపద సృష్టికి ఇది శక్తివంతమైన సాధనం అవుతుందని మేము నమ్ముతున్నాం” అని తెలిపారు.
ఈ ఫండ్ పెట్టుబడి వ్యూహం నాలుగు అంశాల ప్రాతిపదికన ఉంటుంది:
ముమెంటం: హెచ్చుతగ్గులను సరిచేస్తూ, 6 నెలల నుంచి 12 నెలల ప్రైస్ రిటర్న్‌పై ఆధారపడుతుంది.
క్వాలిటీ: గత అయిదేళ్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ (ROE), ఆర్థిక లీవరేజీ (డెట్/ఈక్విటీ నిష్పత్తి), ఆదాయ వృద్ధిలో మార్పులు పరిగణనలోకి తీసుకుంటారు.
వాల్యూ: ఎర్నింగ్స్ టు ప్రైస్, బుక్-టు-ప్రైస్, సేల్స్-టు-ప్రైస్ నిష్పత్తులు, డివిడెండ్ ఈల్డ్ ఆధారంగా మదింపు జరుగుతుంది.
తక్కువ వోలటైలిటీ: గత ఏడాది కాలం రోజువారీ ధర రిటర్నుల స్టాండర్డ్ డీవియేషన్ బట్టి ఇది కొలుస్తారు.
నిఫ్టీ 500 నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన 50 షేర్ల సూచీని ట్రాక్ చేసే ఫండ్ అయిన బజాజ్ అలియాంజ్ లైఫ్ నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్ సహాయం లభిస్తుంది. అధిక రిస్కు సామర్థ్యం కలిగి ఉండి, దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధి కోసం భారత ఈక్విటీల్లో క్రమపద్ధతిలో, ఫ్యాక్టర్ ఆధారిత విధంగా పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు బజాజ్ అలియాంజ్ లైఫ్ యులిప్ ఉత్పత్తులు ప్రయోజనకరంగా ఉంటాయి.









