మిర్యాలగూడ : కనిపించని ప్లాస్టిక్ కవర్స్ నిషేధం.. విక్రయధారులతో ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ : కనిపించని ప్లాస్టిక్ కవర్స్ నిషేధం.. విక్రయధారులతో ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధం ఎక్కడ అమలు కావడం లేదు. ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం చేయాలని గతంలో ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయినా మున్సిపల్ అధికారులు గాని ప్లాస్టిక్ కవర్స్ వ్యాపారాలు గాని ఎమ్మెల్యే ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు.
యధావిధిగా విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం మున్సిపల్ అధికారులు కానీ వ్యాపారస్తుల దుకాణాలను తనిఖీలు కూడా చేయలేదు. దాంతో మంగళవారం మున్సిపల్ అధికారులు, ప్లాస్టిక్ కవర్స్ వ్యాపారులతో స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రతి వ్యాపారస్తులకు మీ ద్వారా ప్లాస్టిక్ కవర్స్ ను తీసుకోవడం జరుగుతుంది.
కావున నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధ పట్టణంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్స్ నిషేధించే దిశగా ప్రజలతో పాటు ప్లాస్టిక్ కవర్స్ యజమాన్యులైన మీరు కూడా సహకరించాలని మీ ద్వారా ప్రజలు కూడా తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలన్నారు. మిర్యాలగూడ అభివృద్ధిలో మీరు కూడా పాత్ర వహించాలని ఆయన కోరారు. పర్యావరణానికి ప్రమాదం కాకుండా ఉండేటువంటి క్లాత్ కవర్స్ ని వాడాలని ఆయన సూచించారు.
అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు ప్లాస్టిక్ కవర్ వ్యాపారులు పాల్గొన్నారు.
ALSO READ :
మాకు లేదా రుణమాఫీ.. విధివిధానాలు రానప్పుడు సమావేశం ఎందుకు, రైతుల ఆందోళన..!
కలెక్టర్ సారూ.. జర ఇటు సూడరూ.. చెట్లు ఎందుకు నరికారో..!
సరైన పత్రాలు లేకుండానే పంట రుణాలు.. ఆ రైతులకు రుణమాఫీ వస్తుందా..!
తెలంగాణలో భారీ వర్షాలు.. ఉప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్, పాఠశాలలకు హాలిడే..!









