Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

సూర్యాపేట :  బస్తీ దావఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

సూర్యాపేట :  బస్తీ తావకాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

సూర్యాపేట , మనసాక్షి

ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళ ఆరోగ్య కార్యక్రమం జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించినారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని కుడ కుడ లో గల బస్తీ దావఖానను సందర్శించి మహిళలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

 

ప్రతి మంగళవారము జిల్లాలో ఉన్న నిర్దేశించిన బస్తీ ధావఖాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలు తమ ఆరోగ్య సమస్యలకు సేవలు పొంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరారు., కుడ కుడ బస్తీ దావఖానలో హాజరైన ప్రతి మహిళ యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వీరికి సేవలు అందించాలని సంబంధిత వైద్యాధికారి , ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.

 

వైద్యాధికారి ఆరోగ్య సిబ్బంది అవసరమైన మందుల తో పాటు చికిత్స అందించాలని కలేక్టర్ సూచించారు..
మహిళలందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి క్యాన్సర్, బిపి, షుగర్ , గర్భాశయ వ్యాధులకు నిర్ణిత సమయంలో గుర్తించి చికిత్స పొందాలన్నారు.

 

అన్ని వ్యాధులకు ప్రభుత్వ బస్తీ ధావఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉచితంగా మందులు అందించి చికిత్స చేస్తారన్నారు. అందరూ మహిళలు ప్రతి మంగళవారము ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం, సిబ్బంది పాల్గొనినారు.

మరిన్ని వార్తలు