Nalgonda : పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ.. సతీమణితో కలిసి వేడుకల్లో జిల్లా ఎస్పి..!
Nalgonda : పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ.. సతీమణితో కలిసి వేడుకల్లో జిల్లా ఎస్పి..!
నల్లగొండ, మన సాక్షి:,
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను ఎస్పి సతీమణి పూజతో కలిసి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ వివిధ రకాల పూలతో బతుకమ్మను అద్భుతంగా పేర్చి బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. పది రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడం మహిళలకు ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుందన్నారు.
మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పండుగ ఉత్సాహంగా జరుపుకోవడం వారిలో చైతన్యాన్ని పెంపొందిచడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరుపున బతుకమ్మ,దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రాములు నాయక్, ఎస్బీ డీఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివ రాం రెడ్డి, సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ, ఏఓ శ్రీనివాస్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐలు సురప్ప నాయుడు, సంతోష్, శ్రీనివాస్, నరేష్, మహిళా సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
MOST READ :
-
Narayanpet : ధాన్యం కొనుగోళ్లలో వ్యవసాయాధికారులదే కీలక పాత్ర.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
-
Ponguleti : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఆ కార్డు తప్పనిసరి.. మంత్రి పొంగులేటి వెల్లడి..!
-
Nalgonda : పేదింటి విద్యార్థికి ఎంబిబిఎస్ లో సీటు. తల్లికి మూడుసార్లు బ్రెయిన్ ఆపరేషన్, ఫీజు కట్టలేక చదువులకు దూరం..!
-
District collector : బతుకమ్మ ఆటలాడిన కలెక్టర్, ఎమ్మెల్యే..!









