Nalgonda : రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..!

Nalgonda : రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..!
నల్లగొండ, మన సాక్షి:
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ఆడపడుచులు జరుపుకునే బతుకమ్మ సంబురాలను రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు నలగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంగళవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలలో మహిళలంతా కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ పూజ, బతుకమ్మ ఆట-పాట,కోలాటం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో కొట్టం మధుసూదన్ రెడ్డి, గుజ్జ జగన్ మోహన్ రెడ్డి, అలుగుబెల్లి రామిరెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, గాదె సైదిరెడ్డి,కోట్ల అశోక్ రెడ్డి, కంచర్ల కుంట్ల వెంకట్ రెడ్డి, అలుగుబెల్లి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలి..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!
-
Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!
-
Time Management : 24 గంటలు సరిపోవడం లేదా.. సమయాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోండి..!









