ఆంధ్రప్రదేశ్Breaking Newsఉద్యోగం

బెస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నాగలత.. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులతో ఘన సన్మానం..!

మదనపల్లి పట్టణం బసిన కొండ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ ఎన్. (కొక్కంటి)నాగ లతను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు జ్యోతి రాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఘనంగా సన్మానం చేశారు. 2025-26 సంవత్సరానికి గాను ఒక సాధారణ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఆరు వేలకు పైగా ఎస్ బీ అకౌంట్లు,600కు పైగా ఆర్ పి ఎల్ అకౌంట్లు ను నాగ లత ఓపెన్ చేశారు.

బెస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నాగలత.. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులతో ఘన సన్మానం..!

మదనపల్లి, మన సాక్షి :

మదనపల్లి పట్టణం బసిన కొండ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ ఎన్. (కొక్కంటి)నాగ లతను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు జ్యోతి రాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఘనంగా సన్మానం చేశారు. 2025-26 సంవత్సరానికి గాను ఒక సాధారణ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఆరు వేలకు పైగా ఎస్ బీ అకౌంట్లు,600కు పైగా ఆర్ పి ఎల్ అకౌంట్లు ను నాగ లత ఓపెన్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అకౌంట్లు ఓపెన్ చేయడంలో ఎన్.నాగ లత ద్వితీయ స్థానంలో నిలవడంతో గుంటూరులో పోస్టల్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు నాగలతను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు పోస్టల్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ నాగ లత గత మూడు సంవత్సరాలు గా రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక అకౌంట్లు ఓపెన్ చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు మూడుమార్లు రాష్ట్రంలో అత్యధిక అకౌంట్లు ఓపెన్ చేసి అవార్డులు పొందినందుకు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

ఒక సాధారణ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో ఏడాదికి దాదాపు రెండు కోట్లకు పైగా ఆదాయం టర్నోవర్ చేయడం వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావం స్పష్టం చేస్తుందన్నారు. అనంతరం నాగలతను మెమెంటో దుశ్శాలవతో ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో అకౌంట్లు ఓపెన్ చేయటంలో ద్వితీయ స్థానంలో నిలిచిన ఎన్. నాగ లతను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పరిచయం చేశారు.

ఈ సందర్భంగా నాగలత వివరాలు తెలుసుకున్న చంద్రబాబు ఆమె అన్నమయ్య జిల్లా వాసి అని తెలియడంతో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లా పోస్టల్ ఎస్ ఎస్ పి లక్ష్మణ్ నాయక్,మదనపల్లి పోస్టల్ అసిస్టెంట్ సూపరిండెంట్ నీలిమ, మదనపల్లి మెయిల్ వర్సెస్ అమర్నాథ్ ప్రోత్సాహం వారు తనకు అందించిన సహకారంతోనే ఇన్ని అకౌంట్లో ఓపెన్ చేయడం జరిగిందని చెప్పారు.

ప్రతి ఏడాది తాను తన బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని గ్రామాలలో పర్యటించి పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో అందుతున్న పథకాలను ప్రజలకు వివరించి అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగిందన్నారు. గత నాలుగేళ్లుగా వరుసుగా రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక అకౌంట్లు చేసిన లిస్టులో తన పేరు ఉండడం గ్రామస్తులు తనకు ఇచ్చిన సహకారం వల్లే సాధ్యమైంది అన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి పోస్టల్ శాఖ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆమె తెలిపారు.

MOST READ :

మరిన్ని వార్తలు