Peddapalli : జాతీయ కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో పోటీల్లో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ..!
Peddapalli : జాతీయ కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో పోటీల్లో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ..!
పెద్దపల్లి, మన సాక్షి ప్రతినిధి :
జాతీయ కుంగ్ ఫూ, కరాటే, తైత్వాండ్ పోటీలలో పెద్దపల్లి జిల్లా విద్యార్థినులు అద్బుత ప్రదర్శన కనబరిచిన వారికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతీయస్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, సెప్టెంబర్-22న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ లో చీఫ్ ఆర్గనైజర్ సింధు తపస్వి ఇంటర్నేషనల్ క్రీడాకారిణి ఆధ్వర్యంలో జరిగిన మొదటి జాతీయ స్థాయి కుంగ్ ఫూ & కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలలో పెద్దపల్లి విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు.
జాతీయ ఛాంపియన్షిప్ 2024 పోటీలలో పెద్దపల్లి జిల్లా లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నుండి 24 మంది బాలికలు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. వివిధ కేటగిరీలలో బాలికలు 20 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించారని అన్నారు. జాతీయ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు.
విద్యార్థినులకు కరాటే, కుంగ్ ఫూ, తైత్వాండ్ పై శిక్షణ అందించిన మాస్టర్లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే లెజెండ్ హీరో సుమన్ తల్వార్, మంకీ ఫిస్ట్ కుంగ్ ఫు మాస్టర్
జి. సతీష్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : పేద ప్రజలకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు..!
-
RunaMafi : రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. వారికి మాత్రమే 4వ విడత మాఫీకి కసరత్తు..!
-
Hyderabad : హైదరాబాద్ నుంచి కొత్తగా 6 నగరాలకు నేరుగా విమానాలు..!
-
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. ఈనెల 28న పోస్టుల భర్తీకై ఇంటర్వ్యూ..!
-
Rythu Bharosa : రైతు భరోసా నిబంధనలు ఫిక్స్.. ఇక వారికే పెట్టుబడి సహాయం..!









