TOP STORIESBreaking Newsసంక్షేమంహైదరాబాద్

Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ ట్విస్ట్.. ఆ తర్వాతే కార్డుల పంపిణీ.. లేటెస్ట్ అప్డేట్..!

Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ ట్విస్ట్.. ఆ తర్వాతే కార్డుల పంపిణీ.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో చేసిన దరఖాస్తులకు సర్వే కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ఇంటింటి సర్వే సందర్భంగా గ్రామ సభలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు పలువురికి మంజూరయ్యాయి. ప్రస్తుతం 1.20 లక్షల కొత్త కార్డులకు మాత్రమే ఏప్రిల్ నెలలో సరుకులు పంపిణీ చేయనున్నారు.

మిగతా మీ సేవ కేంద్రాలలో వివిధ దఫాలుగా దరఖాస్తులు చేసుకున్న వారికి మరోసారి సర్వే నిర్వహించనున్నారు. దరఖాస్తుదారుల వివరాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో నిబంధనల మేరకు ఉన్న వాటిని అధికారులు ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్ నెల వరకు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి కొత్తవారికి మే నెల నుంచి రేషన్ తో పాటు రేషన్ కార్డులను అందజేయనున్నారు.

ఇప్పటికీ అర్హులైన వారి దరఖాస్తుల డేటాను పౌరసరఫరాల శాఖ ఆన్‌లైన్ లో అప్లోడ్ చేసింది. ఆదాయ స్థితిగతులు, గతంలో కార్డు ఉందా..? లేదా..? ప్రత్యేక కార్డు కావాలా..? తదితర వివరాలను యాప్ లో నమోదు చేస్తారు. అనర్హులైతే దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. అర్హులైతే వివరాలు రికార్డు అవుతుంది. సర్వే నివేదికను జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. ఆ తర్వాత అర్హులైన వారికి కార్డులు మంజూరు అవుతాయి.

MOST READ :

  1. TG News : తెలంగాణలో మరో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం..!

  2. Hyderabad : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు..!

  3. Bank New Rules : బ్యాంకుల కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా పై బాదుడే.. తెలుసుకోకపోతే భారీ నష్టమే..!

  4. WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

  5. Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!

మరిన్ని వార్తలు