TG News : మహిళలకు తులం బంగారం.. నెలకు రూ.2500లపై బిగ్ అప్డేట్..!

TG News : మహిళలకు తులం బంగారం.. నెలకు రూ.2500లపై బిగ్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మహిళలు తులం బంగారం పథకం, మహిళకు నెలకు 2500 రూపాయల పథకం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాలు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు. శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రెండు పథకాలపై కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటుగా తులం బంగారం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట విదితమే. దాంతో పాటు మహిళలకు నెలకి 2500 రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. ఈ విషయంపై శాసనమండలిలో చర్చ కొనసాగింది.
దాంతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తున్నామని.. తులం బంగారం, 2500 సహాయ పథకాలను ఆర్థిక పరిమితుల కారణంగా తక్షణమే అమలు చేయలేమని స్పష్టం చేశారు. ఈ విషయంపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విధంగా స్పందించారు.
షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల స్థానంలో కళ్యాణమస్తు పథకం తీసుకొచ్చి తులం బంగారం అందజేస్తామని చెప్పిన మాట వాస్తవమేనని, కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా తక్షణమే అమలు చేయలేమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడగానే కళ్యాణమస్తు పథకానికి తులం బంగారం తో పాటు తెలంగాణ ఆడపడుచులకు నెలకి 2500 పథకాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దాంతో స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఎన్నికల హామీలు అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
MOST READ :
-
Peddapalli : జిల్లా వైద్యాధికారి సంచలన నిర్ణయం.. ప్రైవేట్ ఆసుపత్రి సీజ్..!
-
Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!
-
PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!
-
Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!









