క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్.. ఏడు గంటల్లో చేదించిన పోలీసులు.. కిడ్నాప్ ఎందుకో తెలిస్తే షాక్..!

Nalgonda : నల్గొండ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్.. ఏడు గంటల్లో చేదించిన పోలీసులు.. కిడ్నాప్ ఎందుకో తెలిస్తే షాక్..!

నల్లగొండ టౌన్, మన సాక్షి.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో జరిగిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైందని కిడ్నాప్ జరిగినా ఏడు గంటల లోపు నల్లగొండ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి కేసును చేదించి ఆ బాలుడుని తల్లిదండ్రులకు అప్పజెప్పినట్లు నల్గొండ డి.ఎస్.పి కె శివరామిరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మంగళవారం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో 20 నెలల బాలుడు సోమేశ్వర కుమార్ కిడ్నాప్ గురైన ఘటనలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ డీఎస్పీకే శివరాం రెడ్డి ఆధ్వర్యంలో (04) బృంధాలుగా ఏర్పడి ఆసుపత్రి CC టి‌వి కెమెరాలు పరిశీలించి బస్ స్టాండ్ లో విచారణ చేపట్టి సాంకేతిక పరిజ్ఞానముతో నేరస్థులను గుర్తించామని తెలిపారు.

మిర్యాలగూడెo మండలము తుంగపాడు గ్రామానికి చెందిన బైరం అంజిబాబు, బాగ్యలక్ష్మి దంపతులకు సుమారు (20) నెలల వయస్సు గల సోమేశ్వర కుమార్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం బాగ్యలక్ష్మి (08) నెలల గర్భవతిగా వుండి ఆమెకు ఆరోగ్యము బాగా లేనంధున ఈ నెల 8 న ఆమె భర్త కుమారుడు, పక్కింటి ఆమె కుంచo పార్వతమ్మ తో కలిసి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి లేబర్ వార్డులో అడ్మిట్ అయ్యింది. అప్పటినుండి ఆమె బాగోగులు ఆమెతో వచ్చిన కుంచం పార్వతమ్మ చూసుకుంటుంది.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో వున్న ప్రసూతి విభాగము ముంధు బాలుని తల్లి ఆమెతో వచ్చిన పార్వతమ్మ బాలునితో చెట్టు క్రింధ కూర్చున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వారితో మాటలు కలిపి మోసపూరితంగా పరిచయం ఏర్పరచుకొని బాలున్ని ఆడిస్తున్నట్లు నటించారు. మీ ఇద్దరు భోజనం చేసి రండి బాలుని మేము చూసుకుంటాం అని నమ్మబలికారు.

వెంటనే వారిద్దరు బోజనానికి వెళ్లగానే అధే ఆధునుగా బావించి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు బాలున్ని కిడ్నాప్ చేసి పారిపోయారు. వెంటనే బాలుని కుటుంబంతో కుంచం పార్వతమ్మ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సి సి ఫుటేజీల ద్వారా నిందితులు భువనగిరికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నేరస్తులని గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో పట్టుకొని బాలుడిని సురక్షితంగా రక్షించారు.

నేరస్థురాళ్ళు కిడ్నాప్ ఎందుకు చేశారంటే..?

హైదరాబాద్ కు చెందిన నారాయణ దాస్ అరుణ కు ఒక కొడుకు, ఒక కూతురు కలరు. ఆమె కొడుకు ఇటీవల ఒక సంవత్సరము క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆమె కు మగపిల్లల మీధ ప్రేమతో ఏవిధంగా నైనా ఒక బాలున్ని తీసుకుని వచ్చి పెంచుకోవాలని దురాలోచనతో ధమ్మాయిగూడ లో తాను నివసిస్తున్న ఇంటి పక్కన మరో నేరస్థురాలు జంతిక సుక్కమ్మ @ పాలడుగు సుగుణమ్మ తో చెప్పింది.

వారు ఇద్దరూ కలిసి వ నల్లగొండ బస్ స్టాండ్, ఆసుపత్రి ఏరియాలో చిన్న పిల్లలు వారి తల్లిదండ్రులతో ఉంటారు. తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి పిల్లలను కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తీసుకొని పోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసును 7 గంటలలో చేధించిన పోలీసు సిబ్బంధి టూ టౌన్ సీఐ రాఘవ రావు, నార్కెట్ పల్లి సి‌ఐ నాగరాజు నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ లు సైదులు, సతీష్, మరియు భువనగిరి పట్టణ సి‌ఐ రమేశ్, టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రాజు, పోలీసులు సాగర్ల శంకర్, లావూరి బాలకోటి, జానకి రామ్, తిరుమలేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

MOST READ : 

  1. Miryalaguda : కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన భువనేశ్వర్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందనలు..!

  2. Miryalaguda : గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!

  3. Annamaya : దాడిలో ఇరువర్గాలపై కేసులు నమోదు..!

  4. TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

  5. Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు