Breaking Newsక్రైంతెలంగాణమెదక్
BREAKING : ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన బైక్, ముగ్గురు మృతి..!
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును శనివారం బైకు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు

BREAKING : ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన బైక్, ముగ్గురు మృతి..!
మన సాక్షి, కొల్చారం :
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును శనివారం బైకు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ జాతీయ రహదారిపై జరిగింది. ఆర్టీసీ బస్సును బైకు ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. జాతీయ రహదారిపై మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతులు హవేలీ ఘనపూర్ మండలం బొడుగ భూపతిపూర్ గ్రామానికి చెందిన అమృత్ గౌడ్ (40) ఆయన కుమారుడు రిషి వర్ధన్ గౌడ్ (12), బావమరిది సాయి గౌడ్ (35) గా గుర్తించారు. రంగంపేట గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.









