Breaking : హార్మూజ్ జలసంధి రీ ఓపెన్ కు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..!
హార్మూజ్ జల సంధి రీ ఓపెన్ కు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇలాంటి కీలక ప్రకటన చేసింది.

Breaking : హార్మూజ్ జలసంధి రీ ఓపెన్ కు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
హార్మూజ్ జల సంధి రీ ఓపెన్ కు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇలాంటి కీలక ప్రకటన చేసింది. 14 రోజుల పాటు హార్మూజ్ జలసందిని రీఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చీ పేర్కొన్నారు. దాంతో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా ధ్రువీకరించబడింది. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్ లో కాల్పుల విరమణ అమలులో ఉండనున్న 14 రోజుల్లో ఈ జల సంధిని రీఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా, ఇజ్రాయిల్ తమపై దాడులు నిలిపివేస్తే తాము కూడా దాడులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిపాదన పై చర్చించేందుకు అమెరికా అంగీకరించిందని తెలియజేశారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ వినతితో ఇరాన్ గడువు 14 రోజులు పొడిగిస్తూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. ప్రతిపాదనలకు అమెరికా కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.









