Breaking Newsక్రైంజిల్లా వార్తలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
BREAKING : పిడుగుపాటుతో అన్నదమ్ములు మృతి..!
BREAKING : పిడుగుపాటుతో అన్నదమ్ములు మృతి..!
దమ్మపేట, మన సాక్షి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భారీ వర్షం నేపథ్యంలో ఎర్రన్నపేట గ్రామ శివారులో ఉన్న వారి పొలం దగ్గరికి వెళ్లిన అన్నాదమ్ములు పిడుగుపాటుకు బలయ్యారు.
జమేదారు బంజర గ్రామానికి చెందిన బుర్ర చందు (15), సిద్దు (13) అనే ఇద్దరు అన్నదమ్ములు పొలం వద్దకు వెళ్లగా అదే సమయంలో వారిపై పిడుగు పడడంతో ఇద్దరు షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర సోకసముద్రంలో మునిగిపోయారు. జమేదారు బంజర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి :
BREAKING : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి రవాణా.. పోలీసులకు చిక్కిన మహిళ, మరో ఇద్దరు..!









