క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండలో దారుణ హత్య..!

Nalgonda : నల్గొండలో దారుణ హత్య..!

మనసాక్షి, నల్గొండ ప్రతినిధి :

నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం అర్దరాత్రి దారుణ హత్య జరిగింది. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అన్నపూర్ణ క్యాంటీన్ సమీపంలో హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి రమేష్ (35)గా గుర్తించారు. ఇతడు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటన స్థలాన్ని నల్గొండ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం రమేష్ నల్గొండ పట్టణంలోని బిటిఎస్ కాలనీలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నట్లు సమాచారం. మూడు నెలల నుంచి భార్యాభర్తల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. మూడు నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళినట్లు తెలుస్తోంది. కాగా రమేష్ హత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Kamareddy : జల దిగ్బంధంలో కామారెడ్డి.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదలో కొట్టుకపోయిన కార్లు.. (వీడియో)

  2. Hyderabad : దేవుడిచ్చిన బిడ్డ.. ఖైరతాబాద్ మహా గణపతి వద్ద క్యూలైన్లో మహిళ ప్రసవం..!

  3. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

  4. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

  5. Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి..!

మరిన్ని వార్తలు