Komatireddy Venkatreddy : చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్.. నల్లగొండకు ప్రధాన కేటాయింపులు..!
Komatireddy Venkatreddy : చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్.. నల్లగొండకు ప్రధాన కేటాయింపులు..!
నల్లగొండ, మన సాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్ అని రాష్ట్ర రోడ్లు ,భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ ప్రతిఫలాలు అందించే విధంగా బడ్జెట్లో ప్రయత్నించడం జరిగిందని తెలిపారు.
బడ్జెట్లో ఇరిగేషన్ పెద్దపీటవేయగా, అందులో నల్గొండ జిల్లా ముందుందన్నారు. నల్గొండ జిల్లాలో ఈ రబిలో లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని, దీని ద్వారా దాన్యం దిగుబడి పెరిగినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
బ్రాహ్మణ వెళ్లెములకు బడ్జెట్లో రెండింతలు నిధులు పెంచడం జరిగిందని, బ్రాహ్మణ వెల్దములలో నీళ్లు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని, కాలువలు, ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు గాను 37 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని, డిసెంబర్ నాటికి లక్ష ఎకరాలకు నీరివ్వాలన్న లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
ఎస్ఎల్ బి సీలో ప్రమాదం జరిగి 8 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు.పాఠశాల విద్యలో భాగంగా 11 వేల కోట్ల రూపాయలతో 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలు ఒక్కొక్కటి 200 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పిల్లలకు 6 నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందించడం జరుగుతుందని, ధనవంతుల పిల్లలు చదువుకున్నట్లుగానే ఈ పాఠశాలల్లో పిల్లలు చదువుకోవచ్చని స్పష్టం చేశారు.
వృత్తి విద్య, ఉపాధి అవకాశాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏటీసీలను మంజూరు చేయడం జరిగిందని, నల్గొండ లో 75 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏ టి సి లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.యువతకు ఉద్యోగ అవకాశాలలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్ అండ్ బి బడ్జెట్లో భాగంగా 5900 కోట్లతో 12,000 కిలోమీటర్ల రోడ్లకు వచ్చేనెల 2న టెండర్లు పిలువనున్నామని తెలిపారు.
నూతన హైకోర్టు భవనాన్ని, 2700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించనున్నామని చెప్పారు. రుణమాఫీ కింద నల్గొండ జిల్లాలో 2400 కోట్లు మాఫీ చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతినెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, కాలేశ్వరం కృంగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.
బడ్జెట్లో ప్రస్తావించని అంశాలను సైతం తమ ప్రభుత్వం చేపడుతుందని, జిల్లాను అన్ని రంగాలలో మరింత ముందుకు తీసుకెళ్తామని, ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం జిల్లాలో 973 ఇండ్లు కట్టినప్పటికీ ఏ ఒక్క గృహ ప్రవేశం చేయలేదని , కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఈ వేసవిలో ఒక ఎకరం పంట ఎండిపోకుండా రబి పంటలకు సాగునీరూ అందిస్తున్నామని, అలాగే తాగునీటికీ, విద్యుత్తు ఇబ్బందులేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఈ ప్రెస్ మీట్ లో ఉన్నారు.
MOST READ :
-
WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!
-
Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!
-
TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..!
-
Peddapalli : జిల్లా వైద్యాధికారి సంచలన నిర్ణయం.. ప్రైవేట్ ఆసుపత్రి సీజ్..!
-
Nalgonda : ఫేర్వెల్ పార్టీ లో సినిమా ఫైట్ లా కొట్టుకున్న పాఠశాల విద్యార్థులు.. పోలీసుల రంగ ప్రవేశం..!









