రేపు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం.. బీఆర్ఎస్ పిలుపు..!
రేపు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం.. బీఆర్ఎస్ పిలుపు..!
మన సాక్షి , హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
అధికార, అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆ వ్యాఖ్యలను సమాజమంతా ఖండించాల్సి అవసరం ఉందని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
ALSO READ :
NALGONDA : అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల వల్ల స్వయం ఉపాధి.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!
Telangana : ఆడబిడ్డలను అవమానిస్తారా.., అన్ ఫిట్ సీఎం, రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS
♦️మా మహిళా శాసనసభ్యుల పైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు
♦️అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారు
♦️ఈ అవమానం కేవలం… pic.twitter.com/n8OE3CKDIf
— BRS Party (@BRSparty) July 31, 2024









