Bus Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు దగ్దం..13 మంది సజీవ దహనం..!
ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది.

Bus Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు దగ్దం..13 మంది సజీవ దహనం..!
మనసాక్షి, మార్కాపురం :
ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో 13 మంది సజీవదహనం అయ్యారు. 15 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో 13 మంది సజీవదహనం అయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 40 ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.









