Smoking : ఛాయ్ తాగుతూ.. స్మోకింగ్ చేయోచ్చా.. తెలుసుకోవల్సిందే..!

Smoking : ఛాయ్ తాగుతూ.. స్మోకింగ్ చేయోచ్చా.. తెలుసుకోవల్సిందే..!
మనసాక్షి :
చాలా మందికి ఛాయ్ తాగుతూ సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ఛాయ్, సిగరెట్ కాంబినేషన్ లేనిది వారికి పొద్దు గడవదు. అదో అలవాటుగా మారిపోయి. ప్రతి రోజు ఛాయ్, సిగరెట్ ఉండాల్సిందే. అలాంటివారి ఆరోగ్యం చాలా డెంజర్లో ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. పొగతాగితే కడుపులో క్యాన్సర్ వచ్చే అవకాశం 30 శాతం పెరుగుతుంది.
సిగరెట్, బీడీ, చుట్ట…పేరు ఏదైనా…వాటి నుంచి వచ్చే పొగ…డైరెక్టుగా అన్నవాహికపై ప్రభావం చూపుతుంది.
ఇక ఛాయ్ బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది. సిగరెట్లు తాగడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఈ రెండింటి మిశ్రమం వల్ల ధమనులలో పొరలతో అడ్డంకులు ఏర్పడతాయి. ధమనులు గట్టిగా మారుతాయి. నికోటిన్ నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సిగరెట్లో ఉండే నికోటిన్ పేగుల కదలికను నియంత్రిస్తుంది.
అంతే కాదు…టీ, స్మోకింగ్ కలిపి తాగడం వల్ల ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వస్తుంది. దీనినే IBS అంటారు. పొత్తి కడుపులో నొప్పి…మల విసర్జనలో అసౌకర్యం కలుగుతాయి. గ్యాస్, ఎసిడిటీ తీవ్రంగా పెరుగుతుంది. దీంతో కడుపులో నొప్పి, మలబద్ధకం కూడా వస్తాయి. అందుకే అస్తమానం…ఛాయ్, సిగరెట్ రెండింటిని కలిపి తాగేవారు వెంటనే మానకపోతే. వాటి ప్రభావం వల్ల దీర్ఘకాలంలో నారాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
Reporting :
Mahipal Reddy, Hyderabad









