Youtube Videos : ఇంటర్‌నెట్ లేకుండానే యూట్యూబ్‌లో వీడియోలు చూడొచ్చా.. సూపర్ ఫీచర్ మీకు తెలుసా..!

Youtube Videos : ఇంటర్‌నెట్ లేకుండానే యూట్యూబ్‌లో వీడియోలు చూడొచ్చా.. సూపర్ ఫీచర్ మీకు తెలుసా..!
మనసాక్షి :
స్మార్ట్ ఫోన్‌ల హవా మొదలైనప్పటి నుంచి…ఇంటర్‌నెట్ వాడకం పెరిగిపోయింది. కొంచెం సమయం దొరికితే యూట్యూబ్ వీడియోలు చూడటం చాలా మందికి అలవాటు. అయితే ఇంటర్‌నెట్ లేకున్నా… యూట్యూబ్ వీడియోలు చూడొచ్చని మీకు తెలుసా..?
నెట్‌వర్క్ తక్కువగా ఉన్నప్పుడు…ఫోన్‌లో నెట్ బ్యాలన్స్ అయిపోయినప్పుడు యూట్యూబ్ వీడియోలు చూడాలంటే కుదరదు. అయితే…చిన్న చిట్కాను వాడి ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు.
ఇంటర్‌నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పుడు.. మీకు నచ్చిన యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోండి. యూట్యూబ్‌లో ఉండే అన్ని వీడియోలకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. వీడియో డౌన్‌లోడ్ చేసేప్పుడు…వాటి క్వాలిటీ 480P, 720P ఎంచుకోండి.
దీంతో తక్కువ డాటా అవసరమవుతుంది. వీడియో డౌన్‌లోడ్ చేసుకుంటే మీ పేరుతో ఉండే హిస్టరీలో డౌన్‌లోడ్ ఆప్షన్‌లో…ఆ వీడియో ఉంటుంది. ఇలా డౌన్‌లోడ్ చేసిన వీడియో ఇంటర్‌నెట్ లేకున్నా 29 రోజులపాటు మీకు అందుబాటులో ఉంటుంది. తీరిక వేళలో ఆ వీడియోలను, సినిమాలను చూసుకోవచ్చు.
అలాగే…యూట్యూబ్ గో యాప్‌ని ఉపయోగించి అతి తక్కువ డేటాతో…ఇంటర్నెట్ లేకుండానే వీడియోలు చూడొచ్చు. ఇది ఈజీగా, స్పీడ్‌గా పని చేస్తుందని యూజర్ల మనసు దోచుకుంది.
వైఫై ఉన్నప్పుడు మీకు నచ్చిన వీడియోలను డౌన్లోడ్ చేసుకుని…ఆఫ్‌లైన్‌లోను…ఇంటర్నెట్ లేకుండానే చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.
ఒకవేళ పూర్తిగా యూట్యూబ్ నుండి వీడియోలను మీరు ప్రైవేటుగా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే…ఆ యూఆర్‌ఎల్(URL)అడ్రస్‌ను కాపీ చేసి…యూట్యూబ్ డౌన్‌లోడర్ యాప్‌ల ద్వారా…డౌన్‌లోడ్ చేసుకోండి. ఇందుకు యూట్యూబ్ నుంచి గుర్తింపు ఉన్న అధికారిక వెబ్‌సైట్, యాప్‌లను మాత్రమే వాడండి. లేదంటే…చట్ట విరుద్ధంగా…యూట్యూబ్ నిబంధనలకు వ్యతిరేకంగా వీడియో డౌన్‌లోడ్ చేసుకున్నందుకు శిక్ష తప్పదు.
Reporting :
Mahipal Reddy, Hyderabad
MOST READ :
-
Deep Sleep : చలికాలంలోనూ వెచ్చని నిద్ర.. డీప్ స్లీప్ కావాలా.. తెలుసుకోండి..!
-
Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఆనందంలో పసిడి ప్రియులు..!
-
Ration Cards : తెలంగాణలో ప్రజలకు మరో శుభవార్త.. కొత్త రేషన్ కార్డులకు ధరఖాస్తులు, వారికి కూడా..!
-
Deep Sleep : చలికాలంలోనూ వెచ్చని నిద్ర.. డీప్ స్లీప్ కావాలా.. తెలుసుకోండి..!
-
Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఆనందంలో పసిడి ప్రియులు..!









