BREAKING : మాసాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై కారు పల్టీ.. ఆరుగురు ఉపాధ్యాయులకు గాయాలు..!
BREAKING : మాసాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై కారు పల్టీ.. ఆరుగురు ఉపాధ్యాయులకు గాయాలు..!
అందోలు, మనసాక్షి :
పాఠశాల విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉపాద్యాయుల వాహనం అదుపుతప్పి పల్టీకొట్టి ఆరుగురు ఉపాద్యాయులకు గాయాలైన ఘటన బుధవారం మండల పరిధిలోని మాసాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి..
సంగారెడ్డి జిల్లా అందోలు మండలంలోని నేరడిగుంట, అక్సాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి ప్రై వేట్ టాక్సీ వాహనంలో ఆయా పాఠశాలలకు వెళ్తుంటారు. ఎప్పటిలాగే బుధవారం కూడా ఉపాద్యాయులు పాఠశాల విధులకు హారయ్యేందుకు కారులో బయలు దేరారు.
ఈ క్రమంలో మండంలోని సంగుపేట వద్ద ఉన్న హైవే రోడ్డు బ్రిడ్జిపైకి ఎక్కి కొద్దిదూరం వెళ్లారు. ఉదయం నుండి వర్షపు జల్లులు కురుస్తుండడంతో రోడ్డుపై వర్షపునీరు నిలవడంతో వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న సర్వీస్‌రోడ్డుపైకి దూసుకువెళ్లి పల్టీకొట్టింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న 6 మంది టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. నేరడిగుంట పాఠశాలలో పనిచేస్తున్న వరలక్ష్మి, పూర్ణచంద్రరావు, రాంచెందర్, అక్సాన్‌పల్లి పాఠశాలలో పనిచేస్తున్న మధుసూధన్‌రెడ్డి, ప్రవీణ, జ్యోతి రత్నకుమారి, చౌటకూరుకు చెందిన వాహనడ్రై వర్ ప్రవీణ్‌లు గాయపడ్డారు. ఉపాధ్యాయురాలు వరలక్ష్మికి తలకు గాయం కాగా, జ్యోతి రత్నకుమారి కాలు విరుగగా, మిగతా నలుగురు ఉపాధ్యాయులకు స్వల్పగాయాలయ్యాయి.
వెంటనే 100 నంబరుకు క్షతగాత్రులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వెంటనే జోగిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పీఆర్‌టీయు అధ్యక్షుడు ఎ.మాణయ్య, పీఆర్‌టీయు నాయకులు నరోత్తం, రాజమల్లులు అసుపత్రికి చేరుకుని సహయకచర్యలు చేపట్టారు. ప్రై వేట్ వాహనంలో మెరుగైన చికిత్సల నిమిత్తం సంగారెడ్డి, హైద్రాబాద్ ఆసుపత్రులకు తరలించారు.
LATEST UPDATE :









