Telangana : ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు.. శుభవార్త తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వం..!
Telangana : ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు.. శుభవార్త తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో భాగంగా పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. రైతులకు రుణమాఫీ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు, నియామకాల ప్రక్రియ కూడా కొనసాగుతుంది.
ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త తెలియజేసింది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న డి ఏ (డియర్నెస్ అలవెన్స్) చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఉద్యోగులకు డిఏ ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చించిన అనంతరం కీలకమైన ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ బకాయిలు ఉన్న ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎన్ని డిఏలు అనేది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ, బదిలీలు పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా బదిలీలు పదోన్నతుల్లో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలపై గతంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు కోరగా అన్ని సంఘాలతో చర్చించి అధికారులతో సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
NALGONDA : మా ప్రభుత్వానికి ఇదే నిదర్శనం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!
Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE









