TOP STORIESBreaking Newsజాతీయం

Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు పంట సాగులో నష్టం కలగకుండా దిగుబడి పెరిగి లాభదాయకంగా ఉండాలని కేంద్రం భావిస్తుంది.

Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు పంట సాగులో నష్టం కలగకుండా దిగుబడి పెరిగి లాభదాయకంగా ఉండాలని కేంద్రం భావిస్తుంది. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం పురుగుమందుల నిర్వహణ బిల్లు 2025 ముసాయిదా విడుదల చేసింది. ఈ బిల్లుతో నకిలీ పురుగు మందులకు చెక్ పెట్టాలని భావిస్తుంది.

నకిలీ పురుగు మందుల విక్రయాల వల్ల రైతులు వాటిని వాడడంతో పంట దిగుబడి రాకపోగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని కేంద్రం భావించింది. అయితే నకిలీ పురుగు మందులు విక్రయాల పైన తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. నకిలీ ఉత్పత్తులు అమ్మినా, వాడినా.. నేరంగా పేర్కొన్నది. రైతులు నకిలీ ఉత్పత్తులను వినియోగించినా.. షాప్ యజమానులు విక్రయించినా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

అయితే పెరుగుతున్న పురుగుమందుల వాడకంతో పర్యావరణం దెబ్బతిని రైతులు కూడా దిగుబడులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పురుగు మందుల నిర్వహణ బిల్లు 2025 ముసాయిదా విడుదల చేసిన దానిపై రైతుల నుంచి అభిప్రాయాలను ఫిబ్రవరి 4వ తేదీ లోపు ఇవ్వాలని కోరుతుంది.

గత సంవత్సరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ జవాన్ రైతులతో మాట్లాడినప్పుడు రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల కారణంగా ఆర్థిక ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఫిర్యాదుల తో ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ బిల్లును దేశంలోని అన్ని రాష్ట్రాలలో వ్యవసాయ శాఖ అధికారులకు చిన్న లోపాలు ఉన్నా భారీగా విధించే అధికారాన్ని కల్పిస్తుంది.

అయితే ఈ బిల్లు తో నకిలీ పురుగు మందులు అమ్మినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రైతుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు నకిలీ మందులు అనే విషయం తెలియకుండా వాడాల్సి ఉంటుంది. దుకాణదారుడు విక్రయించిన పురుగు మందులనే రైతులు వినియోగిస్తారు. కాగా నకిలీ పురుగు మందులు విక్రయించకుండానే విక్రయదారులకే జరిమాల వేధిస్తే బాగుంటుందని రైతుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

By : M.N.REDDY, 9705348038

MOST READ NEWS

  1. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  2. Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  3. Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. TG News : తెలంగాణ లో భారీగా IPS ల బదిలీలు..!

మరిన్ని వార్తలు