viralBreaking Newsవైద్యంహైదరాబాద్

Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!

Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

నడిరోడ్లపై ప్రేమ జంటల రొమాన్స్.. బస్సులు, రైళ్లలో ప్రేమికుల ముద్దులు కౌగిలింతలు కంపరం రేపుతున్నాయి. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే జంటలు రెచ్చిపోతూ మనుషుల మధ్య ఉన్నామని విచక్షణ కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటన హైదరాబాద్ మెట్రోలో చోటు చేసుకుంది.

సోమవారం హైదరాబాద్ మెట్రో ట్రైన్ రద్దీగా ఉంది. ఆ యువ జంట చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. చైతన్యపురి స్టేషన్లో మెట్రో ఎక్కిన యువ జంట ఎల్బీనగర్ స్టేషన్ వరకు ప్రయాణించింది. అయితే ఎక్కిన కొద్దిసేపటికి అందరి ముందే రొమాన్స్ మొదలుపెట్టారు. ఎవరు ఏమీ అనకపోవడంతో రెచ్చిపోయిన ఆ జంట ముద్దుల్లో మునిగిపోయారు.

ఇదంతా ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది తెగ వైరల్ గా మారింది. ఈ సంఘటనపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు