Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!
Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో శుభవార్త తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీ లోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేసి రుణ విముక్తులను చేశారు.
ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుణమాఫీ చేసి ఆయన చిరస్థాయిగా నిలిచారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణ మాఫీ చేసి రైతుల పాలిట తిరుగులేని నాయకుడిగా నిలిచారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధుకు బదులుగా రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి రైతు బంధు పథకం ద్వారానే గతంలో మాదిరిగా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అమలు చేశారు.
రైతు భరోసా పథకాన్ని ఈ వానాకాలం సీజన్ లో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రైతుబంధు పథకం ద్వారా రెండు విడతలుగా ఎకరానికి పదివేల రూపాయల సహాయాన్ని గత ప్రభుత్వం అందించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15 వేల రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చింది.
ప్రస్తుత వానాకాలం సీజన్ లోనే రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వాస్తవానికి వానాకాలం సీజన్లో జూన్, జూలై మాసంలోనే రైతులకు రైతు భరోసా అమలు చేసి పంటలకు సహాయం అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది కానీ రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నందున కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తుంది.
రైతు బంధు పథకంలో అనేక అక్రమాలు జరిగాయని వాటిని సరిదిద్ది నిబంధనలు రూపకల్పన చేశారు. కానీ రైతులకు ఈ సీజన్ లోనే రైతు భరోసా కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తుంది.
అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి రోజు రైతు భరోసా పథకాన్ని అమలు చేసి రైతుల ఖాతాలలో ఒకేసారి ఎకరానికి 15 వేల రూపాయలను జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా రెండు విడతలుగా కాకుండా ఒకే విడతలో ఆర్థిక సహాయం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ALSO READ :
Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!
మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!
మిర్యాలగూడ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు..!










