Miryalaguda : ఎస్‌వి మోడల్ హై స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవం..!

Miryalaguda : ఎస్‌వి మోడల్ హై స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ వి మోడల్ హై స్కూల్ లో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నెహ్రూజీ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్, డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులు నృత్యాలు, పాటలు, ప్రసంగాలు, ఫ్యాన్సీ డ్రస్ పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు.
చిన్నారులు ఆకట్టుకునే వేషధారణల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఓరుగంటి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ “బాలలే దేశ భవిష్యత్తు. వారికి ప్రేమ, పరిరక్షణ, నైతిక విలువలు మరియు నాణ్యమైన విద్య అందించడం మన సమాజం యొక్క ప్రధాన బాధ్యత” అని అన్నారు.
ఫ్యాన్సీ డ్రస్ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఓరుగంటి విశాలక్ష్మి, ఇంచార్జి నాగలక్ష్మి లతోపాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
MOST READ :










