Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలో హయత్ నగర్ వరకు మెట్రో..!
Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలో హయత్ నగర్ వరకు మెట్రో..!
మన సాక్షి , రంగారెడ్డి జిల్లా :
ముఖ్యమంత్రి కెసిఆర్ గుడ్ న్యూస్ తెలియజేశారు. త్వరలో హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరించనున్నట్లు తెలిపారు. హయత్ నగర్ నుంచి నేరుగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లే విధంగా మెట్రో లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లో లష్కర్ గూడలో గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం పథకాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు చేరుతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 100 కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో రంగారెడ్డి జిల్లా భూములు మరింత బంగారం కానున్నాయన్నారు.
హయత్ నగర్ నుంచి ఎయిర్ పోర్టు కు మెట్రో లో వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్ల పక్కన తాటి చెట్లని నాటాలనే నిబంధన విధిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు అనే పదవులు ఇచ్చినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో తాటి చెట్లు ఈత చెట్లు తగ్గిపోతున్నాయన్నారు.
ఇవి కూడా చదవండి :
TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!
Good News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉచిత కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం..!









