తెలంగాణBreaking Newsసంక్షేమం
CM Revanth Reddy : గృహజ్యోతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..!
CM Revanth Reddy : గృహజ్యోతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో గృహజ్యోతిపై పోస్ట్ చేశారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఒక్క హైదరాబాద్ నగరంలోనే 10.52 లక్షల కుటుంబాలు గృహ జ్యోతి లబ్ధిదారులుగా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఈ పరిణామం హర్షనీయమని ఆయన పేర్కొన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే గృహాలకు గృహజ్యోతి పథకం ప్రభుత్వం అందిస్తోంది.
MOST READ :










