CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జపాన్ కితాక్యిషూ మేయర్ కజుహిసా టక్యూచీ రాష్ట్ర అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
❇️4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణను అభివృద్ధి పథంవైపు నడిపించడంలో ప్రజా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనుసరిస్తున్న ప్రణాళికలను వివరించారు.
❇️“దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగానే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వచ్చే పదేళ్లలో 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం.
❇️రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాం. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపే ఉంది.
❇️ఇది నల్లేరుపై నడక కాదని తెలుసు. అయినా ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదిలాం. ప్రజల ఆలోచనలే ఆచరణగా ముందుకు వెళుతున్నాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.
❇️ప్రజా ప్రభుత్వ లక్ష్య సాధన కోసం ప్రధానంగా మహిళలు, రైతు సంక్షేమం, యువత, విద్య, వైద్య రంగాల్లో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించారు.
❇️సామాజిక తెలంగాణ కోసం బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం వంటి సామాజిక తెలంగాణ నిర్మాణానికి తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
MOST READ :
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Mahindra : మహీంద్రా థార్ రాక్స్.. డాల్బీ అట్మాస్‌తో సరికొత్త శకానికి నాంది..!
-
Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!
-
BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!
-
RBI : కరెన్సీ నోట్లపై ఆర్బిఐ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!









