TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!
TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ నడుస్తుందా.. అధికారంలోకి వచ్చిన 9 నెలలలోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందా..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
అయితే భువనగిరి వేదికగా మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. పార్టీలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.
ఉత్తంకుమార్ రెడ్డి ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతారని తన నాలుకపై పుట్టుమచ్చ ఉందని వేదిక మీద మాట్లాడాడు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోల్డ్ వార్ బయటపెట్టాయా..? అని చెప్పవచ్చును.
గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వేడి బిజెపిలో చేరిన సమయంలో కూడా రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అయినప్పుడు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా విమర్శించారు. కాగా ప్రస్తుతం మరోసారి రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాన్ని బయటపెట్టారా..? అని చెప్పవచ్చు.
భువనగిరి వేదికగా శుక్రవారం భువనగిరి పార్లమెంటు పరిధిలోని నీటిపారుదల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్, వేముల వీరేశం, మందుల సామేలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తంకుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించి ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడని తన నాలుకపై పుట్టుమచ్చ ఉందని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారై రేపాయి. ఆయన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కూడా ఆలోచన రేకెత్తించేవిగా ఉండటం గమనార్హం.
ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయితరు! నా నాలుకపై పుట్టు మచ్చలు ఉన్నాయి… నేను ఏదంటే అది జరుగుతుంది – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి #KomatireddyRajGopalReddy #UttamKumarReddy pic.twitter.com/eG3NZudIIn
— vanaja morla (@MorlaVanaja) August 30, 2024
LATEST UPDATE :
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!
ఫ్లాష్ న్యూస్ : సెల్ఫీ దిగుతూ సాగర్ ఎడమ కాలువలో పడిన మహిళ.. కాపాడిన స్థానికులు..!
Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!









