Miryalaguda : కాంగ్రెస్‌వి 420 హామీలు.. బిఆర్‌ఎస్ ఆగ్రహం, గాంధీ విగ్రహానికి వినతి..!
Miryalaguda : కాంగ్రెస్‌వి 420 హామీలు.. బిఆర్‌ఎస్ ఆగ్రహం, గాంధీ విగ్రహానికి వినతి..!
కేసీఆర్ పాలనలో తెలంగాణలో స్వర్ణయుగం – ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి:
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ బిఆర్‌ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహానికి వినపత్రాలు అందజేశారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు నిర్దేశనుసారం కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ విగ్రహానికి స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమలు కానీ హామీలతో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు.
తులం బంగారం, నాలుగు వేల పెన్షన్, రైతు భరోసా రూ.15 వేలు ఇలా అనేక హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రశ్నించే గొంతుకుల పై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల తరఫున పోరాడుతున్న బిఆర్‌ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా పేదల కోసం బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తోందని అన్నారు.కేసీఆర్ పాలనలో తెలంగాణలో స్వర్ణయుగం కొనసాగిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గడపగడకూ సంక్షేమ పథకాల ఫలాలను అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని ఎంసీ కోటి రెడ్డి విమర్శించారు.
హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకుముందు బిఆర్ఎస్ శ్రేణులు రెడ్డి కాలనీలోని బిఆర్ఎస్ కార్యాలయం నుంచి సాగర్ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యెడవెల్లి శ్రీనివాస రెడ్డి, జొన్నలగడ్డ రంగా రెడ్డి, మోసిన్ అలీ, ఎండి యూసుఫ్, మాజీ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్, అంగోతు హాతీరాం నాయక్, పాలుట్ల బాబయ్య, చౌగాని బిక్షం గౌడ్, పిసికే ప్రసాద్, రఘుమా రెడ్డి, చిర్ర మల్లయ్య యాదవ్, శ్రీరామ్ రెడ్డి, బల్లెం అయోధ్య, మగ్దూం పాషా, రాములు గౌడ్,
పేరాల కృపాకర్ రావు, బారెడ్డి అశోక్ రెడ్డి, రమావత్ బీమ్లా నాయక్, షోయబ్, గంగుల భిక్షం,కొండారపు బ్రదర్స్, ఈశ్వర్ చారి, గంధం సైదులు, అయిల వెంకన్న, గుడిసె దుర్గా ప్రసాద్, మాజీద్, సాధినేని శ్రీనివాస రావు, అంజన్ రాజు, మన్నెం శ్రీనివాస రెడ్డి, పందిరి వేణు, కోల రామస్వామి, దోనేటి సైదులు,పునటి లక్ష్మీ నారాయణ,జీడీఆర్ జానీ,మజ్జిగపు సుధాకర్ రెడ్డి, మలావత్ రవీందర్ నాయక్, తీరాందాసు విష్ణు,జక్క నాగేశ్వర రావు, నరేష్, పేరుమాళ్ళ ధనమ్మ, ఎలగుబెల్లి నాగరాజు,
మస్తాన్, దైద వెంకటేష్, దుర్గయ్య, బంటు నాగయ్య, నాగభూషణం, రమావత్ వినోద్,ఏడుకొండలు, అజ్మీరా లింగ,చిన్నం రమేష్ బాబు, మీసాల జగదీష్,పల్లా బిక్షం, బీ ఆర్ ఎస్ కెవి పట్టేం శ్రీనివాస రావు, నేరెళ్ళ శివ, తెలుకుంట్ల శేఖర్, నరేష్, ఫణి కుమార్, నాగార్జున, శంకర్ నాయక్, సైదా నాయక్, వెంకటేశ్వర్లు, సాయన్న,లాలూ అహ్మద్, మాచర్ల అంజయ్య, వీరయ్య, చిట్టిపోలు వెంకటేశ్వర్లు, రవి, రాము, రామ్ రెడ్డి, కంపసాటి మధుసూదన్, ఫయాజ్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా రాని రైతులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఫోన్ పే, జి పే వినియోగదారులు తెలుసుకోవల్సిందే..!
-
Additional Collector : స్త్రీ నిధి బకాయిలను పూర్తిగా చెల్లించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!
-
Elections : పంచాయతీరాజ్ శాఖ పై సీఎం రేవంత్ సమీక్ష.. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే..!
-
Suryapet : ఎత్తిపోతల భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి.. భూసేకరణ కమీషనర్ ఆదేశం..!










