DEXOGROW : పిల్లల కోసం డేనోన్ ఇండియా డెక్సోగ్రో.. మెదడు వికాసానికి ఐరన్ బయోటిక్స్ ఫార్ములా..!

DEXOGROW : పిల్లల కోసం డేనోన్ ఇండియా డెక్సోగ్రో.. మెదడు వికాసానికి ఐరన్ బయోటిక్స్ ఫార్ములా..!
ముంబయి:
భారతదేశంలో పిల్లల పోషకాహార లోపం పరిష్కారం దిశగా డేనోన్ ఇండియా కీలక అడుగు వేసింది. దేశంలోనే ప్రముఖ ఆరోగ్య, పోషకాహార సంస్థలలో ఒకటైన డేనోన్ ఇండియా, డెక్సోగ్రో (DEXOGROW)ను ఆవిష్కరించింది. రెండేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పౌష్టిక పాల పానీయం ఇది. మెదడు వికాసంలో ముఖ్య పాత్ర పోషించే ఐరన్ శోషణను మూడు రెట్లు పెంచే వినూత్న ఐరన్ బయోటిక్స్ (Iron Biotics) ఈ డ్రింక్ ప్రత్యేకత అని సంస్థ తెలిపింది.
ఐరన్ లోపం.. దేశవ్యాప్త సమస్య
భారతదేశంలో ప్రతి ముగ్గురు పిల్లలలో ఇద్దరు ఐరన్ లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ పోషకాహార లోపం పిల్లల ఎదుగుదలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ఐరన్ లోపం వల్ల పిల్లల మేధో వికాసం మందగిస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.
అలసట, సరైన శారీరక ఎదుగుదల లేకపోవడం, నేర్చుకునే సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడటం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య తీవ్రమైనదే అయినా, ఐరన్ శరీరం ఎంత వరకు తీసుకుంటుంది (శోషణ) అన్న దానిపై అవగాహన చాలా పరిమితం. ఇది కోట్లాది మంది పిల్లల ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.
డెక్సోగ్రో (DEXOGROW) ప్రత్యేకతలు
“రెండేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల పోషకాహార అవసరాలకు అనుగుణంగా డెక్సోగ్రోను శాస్త్రీయంగా రూపొందించారు. ఐరన్‌ను శరీరం సరిపడా శోషించుకుంటే, పిల్లలలో జీవ ప్రక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి. ఈ డ్రింక్‌లో 36 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
ప్రీబయోటిక్స్, విటమిన్స్ A, C, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ప్రధానం. మెదడు ఎదుగుదలకు DHA, ARA, ఐరన్ కలిసి పనిచేస్తాయి. డెక్సోగ్రోలో చక్కెర, అదనపు ప్రిజర్వేటివ్స్ లేదా కృత్రిమ ఫ్లేవర్స్ ఉండవు. ఇది పసిపిల్లలకు సురక్షితమైన, పౌష్టిక ఆహారం”అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
MOST READ :
-
Miryalaguda : బాలింత మృతి సంఘటనపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. మిర్యాలగూడ శిరీష హాస్పిటల్ పై మెజిస్టేరియల్ విచారణ..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!
-
WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!
-
Metro : మెట్రో చార్జీల తగ్గింపు.. రేపటి నుంచి అమలు.. ఇవీ చార్జీలు..!
-
Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!









