New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, నల్గొండ :
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజా పాలన, గ్రామసభలు, మీసేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా రేషన్ కార్డుల పంపిణీకి అధికారికంగా విచారణ కూడా పూర్తి చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
కాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పై కీలక ప్రకటన చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 14 వ తేదీన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. తిరుమలగిరిలో జులై 14 వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను జూలై 13 వ తేదీ లోగా కచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దాంతో 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
MOST READ :
-
Penpahad : ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు.. ప్రతి ఇంటికి అవకాశం.!
-
Nalgonda : నల్గొండలో మంత్రి ఆడ్లూరికి జిల్లా కలెక్టర్ ఘన స్వాగతం..!
-
District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ సుడిగాలి పర్యటన..!
-
Paddy Cultivation : బురద పొలాలు, వరినాట్లు లేవు.. ఇక అంతా పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టడమే.. అది ఎలాగో తెలుసుకుందాం..!









