Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : గల్లంతైన తండ్రీ కొడుకుల మృతదేహాలు లభ్యం..!

Nalgonda : గల్లంతైన తండ్రీ కొడుకుల మృతదేహాలు లభ్యం..!

కనగల్, మనసాక్షి:

ఎఎమ్మార్పీ ప్రధాన కాలువలో గల్లంతైన తండ్రీకొడుకుల ఆచూకీ ఆదివారం లభ్యమయింది. ఇద్దరి మృతదేహాలు కాలువలో లభ్యమయ్యాయి. నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురంలో తండ్రీకొడుకులు గ్రామ సమీపంలో ఉన్న ఏఎంఆర్పీ కాలువలో ఈతకు వెళ్లి శనివారం గల్లంతైన సంగతి విధితమే.

సురవరం దామోదర్, అతని కొడుకు ఫణీంద్ర వర్మ ఇద్దరూ కాలులో పడి గల్లంతయ్యారు. అప్పటినుంచి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కనగల్ పోలీసులు, దామోదర్ బంధువులు ప్రధాన కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు.

అందులో భాగంగా ఆదివారం మొదటగా దామోదర్ మృతదేహం గుండ్లపల్లి సమీపంలో కాలువలో బయటపడగా, తదుపరి ఫణీంద్ర వర్మ మృతదేహం కోదండపురం సమీపంలో ఏఎంఆర్పి ప్రధాన కాలువలో లభ్యమయింది. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తండ్రీకొడుకులు ఇద్దరు విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కనగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు