Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

PDS : డీలర్లే రేషన్ బియ్యం దందా.. భారీగా పట్టివేత.. ఇద్దరు డీలర్ల పై కేసు నమోదు..!

PDS : డీలర్లే రేషన్ బియ్యం దందా.. భారీగా పట్టివేత.. ఇద్దరు డీలర్ల పై కేసు నమోదు..!

పీఏపల్లి, జనవరి 25, మనసాక్షి:

నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండల పరిధిలోని పేదల బియ్యం పక్కదారి పడుతుందన్న సమాచారంతో శనివారం తెల్లవారు జామున పీఏపల్లి మండల పరిధిలో 53 క్వింటాళ్ల రేషన్ బియ్యం సివిల్ సప్లై అధికారులకు పట్టుబడ్డాయి. పీ.ఏ.పల్లి మండలం తిరుమలగిరి రేషన్ షాప్ లో 31 క్వింటాలు, ఎర్రగుంట తండా రేషన్ షాపులో 22 క్వింటాళ్లు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.

స్టాక్ ఉండాల్సిన బియ్యం కంటే అధికంగా బియ్యం ఉండడంతో పట్టుబడ్డారు. డీలర్లు పంపిణీ చేసేక్రమంలో వినియోగదారుల నుండి నేరుగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని దళారులకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలిపారు.

ఇద్దరు డీలర్ల పై 6A కేసు నమోదు చేసినట్లు దేవరకొండ పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీనివాస్, సైదులు తెలిపారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని దుగ్యాల, మల్లాపురం డీలర్లకు అప్పగించారు.

MOST READ : 

  1. Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!

  3. TG News : నాలుగు పథకాలకు ముహూర్తం ఖరారు.. మండలానికి ఒక గ్రామం ఎంపిక..!

  4. Miryalaguda : ఇటుక బట్టీలపై అధికారుల దాడులు.. యజమానిపై కేసు నమోదు..!

  5. Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు