TOP STORIESనారాయణపేట జిల్లాసినిమా

రవీంద్ర భారతిలో  పేట డాక్టర్ దీపిక అద్భుత నృత్య ప్రదర్శన

రవీంద్ర భారతిలో  పేట డాక్టర్ దీపిక అద్భుత నృత్య ప్రదర్శన

నారాయణపేట , అగఘ్ట 06, మన సాక్షి : హైరాబాద్ రవీంద్ర భారతిలో శుక్రవారం రాత్రి జరిగిన శ్రీ రాధిక సంగీత నృత్య అకాడమీ కి చెందిన 25వ రజతోత్సవ కార్యక్రమంలో నారాయణపేట కి చెందిన ప్రముఖ డాక్టర్ దీపిక శెట్టి చేసిన అద్భుతమైన కూచిపూడి నృత్యం ప్రదర్శనతో శ్రోతలను మైమరపింప చేసింది పలువురు అధికారులు, కళాకారులు, సినిప్రముఖులు డాక్టర్ దీపికను ప్రత్యేకంగా అభినందించారు.

Also read ; 8నుంచి షర్మిల ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర పునఃప్రారంభం

ఈ సందర్భంగా నాట్య రత్న రమణి సిద్ది, ప్రముఖ కూచిపూడి శిక్షకులు భావతుల సేతురాం లు మాట్లాడుతూ కళ అనేది డాక్టర్ దీపికకు భగవంతుడిచ్చిన వరమని ఇటు కళలో అటు వైద్యవృత్తిలో రాణించటం గర్వకారణమని ఇలాంటి కళాకారుల వలనే కళలు కాపాడ బడుతున్నాయని అన్నారు . అనంతరం డాక్టర్ దీపికా ప్రసాద్ శెట్టి మాట్లాడుతూ తన భర్త డా. ప్రసాద్ శెట్టి ప్రోత్సాహం తో సాంప్రదాయ కళలను నేర్పేందుకు నారాయణపేట పట్టణం లో కూచిపూడి నృత్య అకాడమీ ప్రారంభించి కూచిపూడి నాట్యంలో శిక్షణిస్తానని అన్నారు.

మరిన్ని వార్తలు