అభివృద్దిBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన టి యు ఎఫ్ ఐ డి సి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

శనివారం ఆమె మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పనులపై సమీక్షించారు.ముందుగా జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పట్టణంలో షాదీఖాన కు ఎంపికచేసిన స్థలాన్ని, తడకమళ్ళ జంక్షన్ ను తదితర ప్రదేశాలను పరిశీలించారు.

అనంతరం సమీక్షిస్తూ షాదీఖాన పనులు మొదలుపెట్టాలని, అయితే ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోనందున పక్కనే ఉన్న స్థలాన్ని సేకరించేందుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. తడకమళ్ళ జంక్షన్ లో నిర్మాణాల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం తో పాటు,ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటిని సరి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

అలాగే పట్టణంలో బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రతిపాదిస్తే రోడ్లు భవనాల శాఖ ద్వారా సరి చేయడం జరుగుతుందని తెలిపారు. నాలుగో వార్డ్ లో ఉన్న డంపింగ్ యార్డ్ 6 ఎకరాలలో ఉన్నందున అది సరిపోనందున పట్టణానికి దూరంగా స్థలాన్ని గుర్తించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో నలుగురు శానిటేషన్ కార్మికులను ఇండోర్ పంపేందుకు సమావేశంలో నిర్ణయించడం జరిగింది.

ఈ సమావేశంలో టెండర్ల జారీ, కోర్టు కేసుల పరిష్కారం, తదితర అంశాలపై సమీక్షించారు. మున్సిపల్ కార్మికులు తాగునీరు, పారిశుద్ధ్యం తో పాటు అన్ని రకాల విధులు నిర్వర్తించాలని, అన్ని పనుల నిర్వహణపై శ్రద్ద తీసుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన కార్మికులను పెంచే విషయంపై లేఖ రాయాలని అన్నారు. పట్టణంలో బ్లాక్ స్పాట్లను రోడ్డు భద్రత కింద సరిచేసేందుకు ప్రతి పాదనాలను పంపించాలన్నారు.

కోర్టు కేసులను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రెఫర్ చేయాలని చెప్పారు. ఆర్ అండ్ బి ఫ్లైఓవర్ సమస్యలు ఆర్ అండ్ బి ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశానికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ యూసుఫ్ , స్థానిక తహసిల్దార్ లచ్చిరామ్ తదితరులు హాజరయ్యారు.

MOST READ : 

  1. Health: ఉదయం మీ దినచర్యలో ఇవి ఉంటే.. ఇక మీ ఆరోగ్యం మీ వెంటే..!

  2. Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. కొనుగోలుకు ఇదే మంచి ఛాయిస్..!

  3. AI : అదుగో అదుగో.. ఏఐ చదువులమ్మ.. నీట్‌లో అదరగొట్టింది..!

  4. Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై సజ్జనార్ కీలక ప్రకటన..!

  5. Hyderabad : జీహెచ్‌ఆర్ లక్ష్మి అర్బన్‌బ్లాక్స్ మరో మైలు రాయి.. ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్‌’కు రేరా గ్రీన్ సిగ్నల్..!

మరిన్ని వార్తలు