Peddapalli : ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
Peddapalli : ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :
ధరణి దరఖాస్తులను తహసీల్దారులు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధరణి దరఖాస్తులు, ఎల్.ఆర్.ఎస్ వంటి పలు అంశాల పై అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ ధరణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని, మండలాలలో పెండింగ్ ధరణి దరఖాస్తుల సంఖ్య సింగల్ డిజిట్ దాటకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.
ధరణి ద్వారా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులు క్లియర్ చేయాలని పెండింగ్ పెట్టవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఖర్చుల ప్రతిపాదనలు అందజేస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామని, ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ త్వరగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మండలాల పరిధిలో ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, త్వరితగతిన భూ క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య , వి.హనుమ నాయక్, తహసిల్దారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









