Diabetes Patients: డయాబెటిస్ పేషెంట్లు అరటి పండు తింటే..?

Diabetes Patients: డయాబెటిస్ పేషెంట్లు అరటి పండు తింటే..?
మన సాక్షి, ఫీచర్స్ :
డయాబెటిస్ అనేది ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య. దీనిని సకాలంలో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. శరీరంలో ఇన్సులిన్ సరిగా పని చేయకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది.
ఇన్సులిన్ అనేది క్లోమంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మనం తినే ఆహారం కార్బోహైడ్రేట్‌లుగా మారి, చక్కెరగా రూపాంతరం చెందుతుంది. ఇన్సులిన్ ఈ చక్కెరను కణాలకు చేర్చి, శక్తిగా మారుస్తుంది. కానీ, డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది లేదా సరిగా పని చేయదు, దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, శరీరానికి హాని కలిగిస్తుంది. అందుకే డయాబెటిక్ రోగులు ఆహారంలో చక్కెరను నియంత్రించాలని సూచిస్తారు.
అయితే, డయాబెటిస్ ఉన్నవారు అరటిపండు తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం అరటిపండు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అరటిలో విటమిన్ B6, విటమిన్ C, ఐరన్, మాంగనీస్, క్యాల్షియం వంటి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఎముకలు, కండరాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే, అరటిపండు తీపి ఎక్కువగా ఉంటుందని డయాబెటిస్ రోగులు దీన్ని నివారిస్తారు. కానీ, కొంతమంది నిపుణులు డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా అరటిపండు తినవచ్చని చెబుతున్నారు. ఇందులోని సహజ చక్కెర శరీరానికి హాని కలిగించదని, మితంగా తీసుకుంటే సమస్యలు ఉండవని వారు సూచిస్తున్నారు.
Reporting :
B.Santhosh, Hyderabad
MOST READ :
-
Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!
-
Banana : అరటిపండు తినడం వల్ల ఆ.. ప్రయోజనాలు కూడా ఉంటాయి.. అవేంటో తెలుసుకుందాం..!
- Mangos : మామిడి పండ్లు సింపుల్ గా మాగ పెట్టొచ్చు.. ఎలానో తెలుసా..?
- Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!









