Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో అధికార పార్టీ ఆశావహులకు నిరాశ.. రిజర్వేషన్ల ఎఫెక్ట్..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రదర్శించడంతో పాటు రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. దాంతో పాటు మంత్రి మండలి కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తీర్మానం చేసింది.

Miryalaguda : మిర్యాలగూడలో అధికార పార్టీ ఆశావహులకు నిరాశ.. రిజర్వేషన్ల ఎఫెక్ట్..!

మన సాక్షి, మిర్యాలగూడ :

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రదర్శించడంతో పాటు రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. దాంతో పాటు మంత్రి మండలి కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తీర్మానం చేసింది. దాంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా రిజర్వేషన్ల ఖరారు వల్ల అధికార పార్టీలో ఆశావహులకు నిరాశ ఎదురైంది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో చైర్మన్ బరిలో ఉండాలనుకునే అధికార పార్టీ ఆశావాహులకు ఈసారి కనీసం కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం లేకుండా రిజర్వేషన్లు తారుమారయ్యాయి. దాంతో అధికార పార్టీ నేతలు అంతు చిక్కని మనోవేదనలో ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సీటు జనరల్ స్థానం వస్తుందని భావించిన కొందరు నేతలు పోటీకి దిగేందుకు సిద్ధమయ్యారు.

కానీ జనరల్ మహిళ చైర్పర్సన్ రిజర్వేషన్ అయ్యింది. అయినప్పటికీ ఆ నేతలు తమ సతీమణులను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు. కానీ గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన వార్డులలో అనుకూలంగా రిజర్వేషన్ రాకపోవడంతో చిక్కుల్లో పడ్డారు. దాంతో చైర్మన్ సీటు దక్కించుకోవాలనుకునే ఆశావాహ నేతలకు నిరాశ ఎదురయింది. కనీసం వారికి సమీపంలో ఉన్న వార్డులలో పోటీ చేసేందుకు కూడా కొంతమందికి అవకాశం లేకుండా పోయింది.

కేవలం ఒకరిద్దరు నేతలకు మాత్రమే అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చాయి. అయితే చైర్మన్ రేసులో కూడా వారే ఉండే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా రిజర్వేషన్ల తారుమారు వల్ల అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే విముఖత మొదలయ్యింది. వారంతా ఎన్నికలకు దూరంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనే ఆలోచనలో పార్టీ వర్గాలు ఉన్నాయి. ఏదేమైనా మరో రెండు మూడు రోజుల్లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే విషయం పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

MOST READ 

మరిన్ని వార్తలు