Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District Collector : వంటగదిలో జిల్లా కలెక్టర్..!

District Collector : వంటగదిలో జిల్లా కలెక్టర్..!

జగిత్యాల, (మన సాక్షి)

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పోరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆదేశించారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులను, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో అన్ని వసతులు, సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఏ తరగతిలో ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆరా తీశారు. కిచెన్, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట, ఆర్డీవో, శ్రీనివాస్ , ఎస్సీ వెల్ఫేర్, రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు