Municipal Elections : జిల్లా కలెక్టర్ సంచలన ప్రకటన.. మున్సిపల్ ఎన్నికల్లో వారే కీలకం..!
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎఫ్‌ఎస్‌టి , ఎస్‌ఎస్‌టి (ఫ్లయింగ్ స్క్వాడ్ ) స్టాటిక్ సర్వైలెన్స్ టీం ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్, బి చంద్రశేఖర్ అన్నారు .మంగళవారం ఆయన ఉదయాదిత్య భవన్ లో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఏర్పాటుచేసిన ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి ,ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలతో సమావేశం నిర్వహించారు.

Municipal Elections : జిల్లా కలెక్టర్ సంచలన ప్రకటన.. మున్సిపల్ ఎన్నికల్లో వారే కీలకం..!
నలగొండ, మన సాక్షి.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎఫ్‌ఎస్‌టి , ఎస్‌ఎస్‌టి (ఫ్లయింగ్ స్క్వాడ్ ) స్టాటిక్ సర్వైలెన్స్ టీం ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్, బి చంద్రశేఖర్ అన్నారు .మంగళవారం ఆయన ఉదయాదిత్య భవన్ లో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఏర్పాటుచేసిన ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి ,ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలుచోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నగదు, మద్యం, బహుమతులు, ఇతర ప్రలోభక వస్తువుల అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని అన్నారు.చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఎఫ్‌ఎస్‌టి బృందాలు క్షేత్రస్థాయిలో చురుకుగా తిరుగుతూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. బృందాల నిర్వాణ?బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు?డబ్బు, మద్యం పట్టుబడితే ఎలా సీజ్ చేస్తారో? ఆయా బృందాలను అడిగి తెలుసుకున్నారు .
మున్సిపల్ ఎన్నికల హ్యాండ్ బుక్ ఒకటి పది సార్లు చూసుకొవాలని,అవసరమైతే మున్సిపల్ కమిషనర్ సలహాలనుతీసుకొవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్బంగాజిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి ఏవైనా సమస్యలు ఉంటే గ్రూప్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. ఉద్యోగులు ఎన్నికలలో రాజకీయ పార్టీలకు సహాయం చేసిన ,ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.
జిల్లాఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తిస్థాయి అప్రమత్తతతో పనిచేస్తుందని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిసరాల్లో భద్రతను బలోపేతం చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు. కలగకుండా చూడాలని, పెళ్లిళ్ల సమయంలో, ఆస్పత్రికి వెళ్లే వారి సమయంలో ఉదాసీనతతో వ్యవహరించాలని, నగదు, మద్యం పట్టుబడితే వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించాలన్నారు . విధులను పారదర్శంగా నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి , గృహ నిర్మాణ సంస్థ పిడి రాజకుమార్, జెడ్పిసిఈఓ బి .శ్రీనివాసరావు, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు హాజరయ్యారు.
By: SHEKAR, NALGONDA
MOST READ :
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
-
TG News : తెలంగాణ మంత్రి మండలి సంచలన నిర్ణయాలు ఇవే..!
-
Medaram : సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి..!










