District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగి సస్పెండ్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగి సస్పెండ్..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి,
తరచుగా గృహ హింసకు పాల్పడుతూ భార్యా పిల్లల బాగోగులు పట్ల శ్రద్ధ వహించని ప్రభుత్వ ఉద్యోగి ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఫార్మసిస్టుగా పని చేస్తున్న
కె .రవీందర్ భార్యా పిల్లలను పట్టించుకోకుండా వారి పోషణను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయన భార్య కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిందని అన్నారు.
స్థానిక సఖి కేంద్రం సిబ్బంది భార్యాభర్తల ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించడానికి ప్రయత్నించగా,
కె .రవీందర్ సహకరించలేదని, గృహహింస నిరోధక చట్టం ప్రకారం జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ నోటీసులు జారీ చేసినప్పటికీ రవీందర్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు
నివేదిక అందించారని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన నియమావళి ప్రకారం
భార్య పిల్లల పోషణను నిర్లక్ష్యం చేస్తున్న ఫార్మాసిస్టు కె రవీందర్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
MOST READ :
-
Urea : ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పిఎసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతన్న రైతులు.. (వీడియో)
-
Job Mela : నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.. జాబ్ మేళా ఎప్పుడంటే..!
-
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!
-
Urea : యూరియా కొరత లేదు.. ఎరువుల గోదామును పరిశీలించిన జిల్లా సహకార అధికారి..!
-
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!









