తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

District collector : జిల్లా కలెక్టర్ షాక్.. ఆ పీహెచ్సీ కి వెళ్తే అందరూ ఆబ్సెంటే..!

District collector : జిల్లా కలెక్టర్ షాక్.. ఆ పీహెచ్సీ కి వెళ్తే అందరూ ఆబ్సెంటే..!

పీఏపల్లి, మన సాక్షి:

గ్రామీణ ప్రాంత మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం నల్గొండ జిల్లా గుడిపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించిన సందర్భంలో ఎక్కువ మంది సిబ్బంది సెలవులో ఉండడం పై వారి సెలవు చీటీలను తనిఖీ చేశారు.

ఆసుపత్రి పరిధిలో శిశు మరణాల సంఖ్యను, ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, వివిధ రకాల జబ్బులతో ఆసుపత్రికి వస్తున్న పేషంట్ల వివరాలను వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ద్వారా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో రక్తహీనత ఉన్న మహిళలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం గుర్తించిన జిల్లా కలెక్టర్ ఎందుకు ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని డాక్టర్ ను ప్రశ్నించగా ? పౌష్టికాహార లోపం కారణమని డాక్టర్ తెలిపారు.

మహిళల్లో పౌష్టికాహార లోపం ఉన్నట్లయితే వారు వివిధ రకాల జబ్బులకు గురయ్యేందుకు అవకాశం ఉందని, అందువల్ల అలా కాకుండా గ్రామీణ ప్రాంత మహిళల్లో పౌష్టికాహారం పై అవగాహన కల్పించేందుకు అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వైద్య ఆరోగ్య, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆమె చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రి లోని వివిధ వార్డులు, అన్ని గదులు, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ రిజిస్టర్, పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవో పద్మ, గుడిపల్లి తహసిల్దార్, తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Nalgonda : నిమిషం నిబంధన లేదు.. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఇవి తీసుకెళ్లొద్దు..!

  2. Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

  5. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు