District Collector : భవిత కేంద్రం ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ అసహానం.. కీలక ఆదేశాలు..!

District Collector : భవిత కేంద్రం ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ అసహానం.. కీలక ఆదేశాలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం ఆవరణలో గల భవిత కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం ఎంతమంది ఉన్నారని, వారికి విద్యా బోధన ఎలా చేస్తున్నారని ఆమె అడిగి తెలుసుకున్నారు.
పిల్లలకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. విద్యా బోధన పరికరాలను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. పిల్లల కు రవాణా ఛార్జీలు ఎలా చెల్లిస్తునారని ఆరా తీశారు. కేంద్రంలో వాష్ బేసిన్, మరుగు దొడ్లు లేకపోవండపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పక్కనే మరుగుదొడ్లు ఉన్నాయని, కానీ నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయని ఎంఈవో బాలాజీ కలెక్టర్ కు తెలపడంతో స్పందించిన కలెక్టర్ ఒక్కరోజులో మరుగుదొడ్లకు నీటి వసతి కల్పించి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపాలిటీ కమిషనర్, ఎంపీడీఓను ఆదేశించారు. ఎమ్మార్సీ భవనాన్ని కూడా పరిశీలించారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెండ్..!
-
Social Media: రీల్స్‌కు బానిసయ్యారా.. ఈజీగా వదిలించుకోండిలా..!
-
PMSBY : రూ.20 చెల్లిస్తే ఏడాదికి రెండు లక్షల ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..!
-
Pimples: నుదుటిపై మొటిమలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే మచ్చలతో సహా పోతాయి..!









