Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డాక్టర్ సరెండర్..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డాక్టర్ సరెండర్..!

పెద్దపల్లి,ధర్మారం, మన సాక్షి :

రామగుండం జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న రామగుండం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ను సరెండర్ చేస్తున్నట్లు రామగుండం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఏప్రిల్ 26న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ రామగుండం ఆసుపత్రి పరిశీలన సందర్భంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆసుపత్రిలో ఎం.ఐ.సి.యూ వార్డు పేషంట్లతో దురుసుగా ప్రవర్తిస్తూ వైద్య వృత్తికే అవమానకరంగా వ్యవహరించడం ఆసుపత్రిలో రోగులకు జరిగే సేవలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించడం పట్ల జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.

రోగులతో కూడా దురుసుగా ప్రవర్తిస్తారని అనేక ఫిర్యాదుల ఉన్నాయని, ఎటువంటి సమాచారం అందించకుండా రెండు రోజుల పాటు విధులకు గైర్హాజరు అయ్యారని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ను సరేండర్ చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామగుండం జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ బి.చంద్రశేఖర్ ను ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమం సంచాలకులకు సరెండర్ చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

  2. District collector : ప్రతి రైతుకు ఆధార్ తరహాలో భూధర్ కార్డు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

  3. Flash.. Flash : యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..!

  4. TG News : తెలంగాణకు చల్లని కబురు.. మొదలైన చల్లటి గాలులు.. జిల్లాలకు అలర్ట్..!

  5. District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

మరిన్ని వార్తలు